దిశ యాప్‌ పై అవగాహన

2091చూసినవారు
దిశ యాప్‌ పై అవగాహన
దిశయాప్‌ మహిళల భద్రత కు రక్షణకు ఎంతగానో ఉప యోగపడుతుందని డీఎస్పీ సీతారామయ్య తెలిపారు. గురువారం పార్కు రోడ్డు దగ్గర మహిళలకు దిశ యాప్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మహిళా పోలీసులు కలిసి మహిళలు, యువతకు దిశాయాప్‌పై విస్తృతంగా అవగాహన కల్పిస్తూ దిశ యాప్‌ ఆవశ్యకతను వివరించారు. స్మార్ట్‌ ఫోన్స్‌లో యాప్‌ రిజిస్ర్టేషన్‌ చేయించి ఆపద సమయంలో దిశాకు ఎస్‌ఓఎస్‌ బట న్‌ ఉపయోగించి తక్షణమే పోలీసుల సహాయం ఎలా పొందాలో మహిళల రక్షణ కోసం దిశా యాప్‌ విశిష్టతపై అవగాహన కల్పించారు. ఒంటరిగా ఆటోలు, ఇతర వాహ నాల్లో ప్రయాణించే వారు ట్రాక్‌ మై ట్రావెల్‌ అను ఆప్షన్‌ వినియోగించుకుంటే వారు వెళ్లే రూట్‌ను ట్రాక్‌ చేస్తామన్నారు. ఈ వాహనం సరైన మార్గంలో వెళ్లని పక్షంలో వెం నే సంబంధిత ప్రాంత పోలీసులను అప్రమత్తం చేస్తుందని తెలియజేశారు. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరితో ఈ దిశా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని రిజిస్ర్టేషన్‌ చేసుకుని ఆపద సమయంలో వినియోగించుకునేలా మహిళలకు ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ మధుసూదన్ రావు, టౌన్ ఎస్ఐ మస్తాన్ వలి, కానిస్టేబుల్, సచివాల మహిళా పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్