గోనెగండ్లలో చిన్ననాటి మిత్రుని కుటుంబానికి చేయూత

56చూసినవారు
కలిసి చదువుకున్న మిత్రుడు చిన్న వయసులోనే అకాల మరణం చెందారు. ఆదివారం గోనెగండ్ల మండల పరిధిలోని పెద్దమర్రివిడు గ్రామానికి చెందిన బుక్ కిపర్ కటికె నబీ రసూల్(40) ఇటీవల 9 నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. అయితే స్నేహితుని మృతి తరువాత కుటుంబంలో కూతురు వివాహం ఉందని 2000 బ్యాచ్ కు చెందిన తోటి స్నేహితులు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఇంకా మున్ముందు ఏ సాయం అవసరమున్న సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్