మున్సిపాలిటీలో పని చేసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని గురువారం ఎమ్మిగనూరులోని మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ఏఐటీయుసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ. ఏళ్ల తరబడి కార్మికులు వెట్టిచాకిరీ చేస్తున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారని ఆరోపించారు. తక్షణమే కంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.