బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

64చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా వాయవ్య దిశగా పయనిస్తోందని పేర్కొంది. అల్పపీడనం బలపడి వాయుగుండం, ఆపై తుఫానుగా మారనుందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. కాగా, ఈ తుఫానుకు ‘దానా’గా నామకరణం చేశారు.

సంబంధిత పోస్ట్