మాల్దీవుల ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాల్దీవులలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలను ప్రారంభించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కేబినెట్ మీటింగ్‌లో ప్రకటించారు. ఈ నిర్ణయం మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రయోజనాలను తెస్తుందని అక్కడి నేతలు భావిస్తున్నారు. దేశంలో పనిచేస్తున్న బ్యాంకులు, టెలికాం కంపెనీలు, ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలను ఇందులో చేర్చాలని ముయిజ్జూ తెలిపారు.