ఏపీ హైకోర్టులో ఆ పిటిషన్ వెనక్కు తీసుకున్న పవన్

79చూసినవారు
ఏపీ హైకోర్టులో ఆ పిటిషన్ వెనక్కు తీసుకున్న పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పిటిషన్‌ను వెనక్కు తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం.. వారాహి యాత్ర సందర్భంగా ఏలూరులో వాలంటర్లను ఉద్దేశించి పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు వేసింది. తనపై దాఖలైన కేసును కొట్టేయాలని పవన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ నె1 19న ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రస్తుత పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని పవన్ కోరగా.. హైకోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్