ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి గ్రామసభలు జరగనున్నాయి. వివిధ పనులు, సమస్యల పరిష్కారం, తీర్మానాలకు సంబంధించి ప్రజలతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చిస్తారు. దేశంలో మొదటిసారిగా 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించడం ఇదే మొదటిసారి. పంచాయతీలు స్వయం సమృద్ధి కావాలన్న ధ్యేయంతోనే వీటిని నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.