ఏపీలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఉండవల్లిలో సోమవారం ఇంజినీరింగ్ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు లోకేష్‌తో సమావేశమయ్యారు. విద్యావ్యవస్థలో నైతిక విలువలతో కూడిన సంస్కరణలు తేవాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆర్టీఎఫ్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో మిగిలిన రూ.216.04 కోట్లు కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.