AP: అరుదైన చేపగా గుర్తింపు పొందిన కచిడి చేప మత్స్యకారులకు కాసుల వర్షం కురిపించింది. కాకినాడ సముద్రతీరంలో మత్స్యకారుల వలకు 25 కేజీల కచిడి చేప చిక్కింది. దీనికి కుంభాభిషేకం రేవులో వేలం వేయగా రూ.3.95 లక్షలు పలికింది. ఈ చేపలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని, అందుకే దీనికి డిమాండ్ ఎక్కువ అని మత్స్యకారులు చెబుతున్నారు.