ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా" వారు ది. 23-08-2024 న ప్రకటించిన సి.ఎం.ఏ ఫైనల్ పరీక్షా ఫలితాలలో ప్రముఖ విద్యాసంస్థ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా 1వ ర్యాంక్,3వ ర్యాంక్,8వ ర్యాంక్ మరియు సి.ఎం.ఏ ఇంటర్ ఫలితాలలో ఆల్ ఇండియా 3వ ర్యాంక్, 9వ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించారు. ఈ విజయంతో మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థ కామర్స్ కోర్సుల ఫలితాలలో మరోమారు తన నెం.1 స్థానాన్ని పదిలం చేసుకుందని మాస్టర్ మైండ్స్ క్యాంపస్ ఇన్ ఛార్జ్ వై.శ్రీనివాసరావు (వై.ఎస్.ఆర్) తెలిపారు. ఈ యొక్క విజయోత్సవ బైక్ ర్యాలీ ని వై.ఎస్.ఆర్ మరియు ఆంజనేయ విజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాస్టర్ మైండ్స్ అధ్యాపకేతర సిబ్బంది అందరూ కళాశాల ప్రాంగణం నుండి బైక్ ర్యాలీ తో బయలుదేరి శంకర్ విలాస్ లాడ్జి సెంటర్ మీదగా ర్యాలీ నిర్వహించి తిరిగి మరలా క్యాంపస్ కి చేరుకున్నారు. అంతే కాకుండా కళాశాల ముందు ఆనందోత్సహాలతో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ముఖ్యంగా ఇలాంటి విజయసాధనకు కారణభూతులైన అధ్యాపకులను, అధ్యాపకేతర సిబ్బందిని మరియు కష్టపడి చదువుకున్న విద్యార్థినీ విద్యార్థులను తల్లిదండ్రులను మాస్టర్ మైండ్స్ యాజమాన్యం వారు అభినందించారు.