ఏపీ పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మానవత్వం చాటుకున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ నుంచి గుంటూరు వెళ్తుండగా.. ప్రకాశం బ్యారేజి వద్ద రెండు బైక్ లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ యువకుడి తలకు గాయమైంది. దీనిని గమనించిన మంత్రి వెంటనే తన వాహనం ఆపి, సిబ్బంది సాయంతో అతడికి ప్రథమ చికిత్స చేశారు. 108కి ఫోన్ చేసి అంబులెన్స్ రప్పించి, అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడికి మెరుగైన చికిత్స అందించేలా చూడాలని అంబులెన్స్ సిబ్బందికి సూచించారు.