ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. వేడుకలో పాల్గొన్న పోలీసులు, అధికారులకు బహుమతులు అందజేశారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.