ప్రమాదమా.. కుట్రా అనే కోణంలో విచారణ: హోంమంత్రి అనిత

75చూసినవారు
AP: తిరుపతి తొక్కిసలాట ఘటన ప్రమాదమా.. ఏదైనా కుట్ర కోణమా అనే అంశం విచారణలో తేలుతుందని హోంమంత్రి అనిత చెప్పారు. రుయా ఆసుపత్రిలో క్షతగాత్రులను మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రాంనారాయణతో కలిసి ఆమె పరామర్శించారు. ఘటన వివరాలను మంత్రులకు ఎస్పీ, కలెక్టర్ వివరించారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని అనిత స్పష్టం చేశారు. వైఫల్యం ఎవరిదో సీసీ కెమెరాల్లో తెలుస్తుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్