మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఆ ప్రాంత ప్రజల్లో భయానక వాతావరణం నెలకొంది. అదృష్టవశాత్తూ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, అగ్నిప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.