ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడి బ్యాగులో మొసలి తల బయటపడడం కలకలం రేపింది. జనవరి 6న కెనడాకు చెందిన ఓ వ్యక్తి టొరంటో వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. అయితే తనిఖీల్లో భాగంగా సిబ్బంది అతడి బ్యాగును తనిఖీ చేయగా మొసలి తల లభ్యమైంది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని మొసలి తలను డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపారు.