ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముంగేలి జిల్లాలో గురువారం సాయంత్రం బాల్కో థర్మల్ పవర్ ప్లాంట్‌లో నిర్మాణంలో ఉన్న చిమ్నీ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దాదాపు 30 మంది కార్మికులు దాని కింద చిక్కుకుపోయారు. వీరిలో 9 మంది మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే చిమ్నీలోని శిథిలాల నుంచి ఇద్దరు వ్యక్తులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.