పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్

2623చూసినవారు
పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్
ఏపీలో ఎన్నికల కాక మొదలైంది. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా కాకుండా తన మీద ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తేనే పవన్ పోటీలోకి దిగుతారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో కాకినాడ పరిధిలో పవన్ కళ్యాణ్ పార్టీకి గుండు సున్నా తప్పా ఏమి రాదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్