బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న రెండు రోజుల్లో అల్పపీడనం పశ్చిమ వాయివ్య దిశగా పయనించి బెంగాల్ సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 20 నుంచి అక్టోబరు మొదటి వారం వరకు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.