కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్యపై కొనసాగుతున్న నిరసనల మధ్య ప్రాణాలు కోల్పోయిన 29 మంది కుటుంబాలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. "జూనియర్ డాక్టర్లు సుదీర్ఘకాలం విధుల్లోకి చేరకపోవడంతో ఆరోగ్య సేవలలో అంతరాయం ఏర్పడి.. మేం 29 జీవితాలను కోల్పోవడం విచారకరం, దురదృష్టకరం" అని మమతా అన్నారు. ఆగస్టు 9 నుంచి వైద్యులు నిరసన చేస్తున్నారు.