ఈ సారి సాధారణం కంటే అధిక వర్షాలు: ఐఎండీ

75చూసినవారు
ఈ సారి సాధారణం కంటే అధిక వర్షాలు: ఐఎండీ
నైరుతి రుతుపవనాల రాకతో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో సాధారణం కంటె అధిక వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. మధ్య, దక్షిణ భారత దేశంలో సాధారణం కంటే ఎక్కువగా, వాయువ్య భారతంలో సాధారణం, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ తెలిపారు. మరో ఐదు రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్