కెనడాలో ఓ చైనా యువతి భారతీయులపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. కెనడాలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఓ చైనా యువతి వెళ్లింది. అక్కడ భారతీయులను చూసి షాకైపోయింది. రవాణా శాఖ కార్యాలయంలో ఎక్కడ చూసినా భారతీయులేనని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తన చుట్టూరా వారే కూర్చున్నారంటూ వీడియో రికార్డు చేసి నెట్టింట పంచుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.