‘ఆంధ్రుల హక్కు’ విశాఖ ఉక్కు పరిశ్రమ సెయిల్‌లో విలీనం కానుంది. రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లు మూతపడి, ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతోన్న స్టీల్ ప్లాంటును తిరిగి పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 1,325 రోజులుగా కార్మికులు చేస్తున్న పోరాటానికి ఫలితాన్ని చూపించనున్నాయి. ‘విలీన ప్రతిపాదనపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎన్‌ఎండీసీతో చర్చలు జరుగుతున్నాయి. విలీనానికి పరిష్కారం ఆలోచిస్తున్నాం’ అని కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి పేర్కొన్నారు.