తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపైకి చేరుకోవడంతో మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. 8 రోజుల్లో తిరిగొస్తామని వెళ్లి 286 రోజులకు తిరిగి భూమిపైకి వచ్చిన వారికి సుస్వాగతం పలికారు. వీరి కథ అడ్వేంచర్ మూవీకి ఏ మాత్రం తీసిపోదని, బ్లాక్ బస్టర్ అని Xలో రాసుకొచ్చారు. సునీత, బుచ్ మరింత శక్తిని పొందాలని కోరుకున్నారు.