హోళగుంద మండలం దేవరగట్టు బన్ని ఉత్సవానికి వేదపండితులు ముహూర్తం ఖరారు చేశారు. అక్టోబర్ 7న కంకణధారణ, నిశ్చితార్థం, 12న మాళమల్లేశ్వరస్వామి మాంగల్య ధారణ, కల్యాణోత్సవం, బన్ని జైత్రయాత్ర, 13న దైవ కార్ణికం, 14 స్వామి రథోత్సవం, 15న గోరవయ్యాల ఆట, 16న స్వామి, అమ్మవారి విగ్రహాలు నెరణిక గ్రామానికి చేరుకుంటాయని ఆలయ పెద్దలు శనివారం తెలిపారు.