ఆదోనిలో క్రికెట్ అసోసియేషన్ క్రీడాకారుడు యోధ శంకర్ రెడ్డి ఈనెల 4వ తేదీ నుండి 23 వరకు కడపలో జరిగే అండర్-14 ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలకు కర్నూలు జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపిక అయ్యారు. ఆదోని క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విట్టా రమేష్, వైస్ ప్రెసిడెంట్ ముజీబ్, ఆదోని జనసేన ఇన్చార్జ్ మల్లప్ప, సెక్రటరీ వెంకటేశ్, అసోసియేషన్ సభ్యులు, కోచ్ బాలాజీ రావు బుధవారం యోధ శంకర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.