బనగానపల్లె ఎమ్మెల్యే, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం ఏపీ అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలపై స్పందించారు. అక్రమ కేసులు బనాయించి 32 రోజుల పాటు తనను జైలులో ఉంచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండోసారి తాను ఓడిన తర్వాత బనగానపల్లెలో టీడీపీ కార్యకర్తలపై అనేక కేసులు పెట్టారన్నారు. తనపై కూడా అక్రమ కేసులు పెట్టి 32 రోజుల పాటు జైలుపాలు చేశారన్నారు.