అవుకు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. విద్యుత్ అధికారులు అప్రమత్తమై గుండ్లశింగవరం నుంచి బనగానపల్లె వరకు ఉన్న విద్యుత్ లైన్లను పరిశీలించారు. సమస్య ఉన్న లైన్లకు మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధించారు. బయట వర్షం, ఇంట్లో ఉక్కపోతతో ప్రజలు నాలుగు గంటల పాటు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.