డోన్ పట్టణంలోని వినాయకుని గుడి సమీపంలో ముగ్గురు యువకులు కొట్టుకుంటూ వీరంగం సృష్టించారు. తిమ్మాపురానికి చెందిన వడ్డే వెంకటేశ్లర్లును ప్రవీణ్, మహేశ్, కిషోర్ దాడి చేసి కొట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది.