డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి టీడిపి పార్టీ కార్యాలయంలో వరద బాధితుల కోసం విరాళాల సేకరణ కార్యక్రమంలో సోమవారం పాల్గొన్నారు. వరదలలో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడం మన బాధ్యత, అందుకుగాను ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఏదో ఒక రూపంలో సహాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే ముందుగానే రెండు లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసినదే. ఈ సేకరణలో భాగంగా మరోసారి లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు.