ఎన్డిఏ కూటమి ప్రభుత్వం జిపియస్ అమలుకు సంబంధించి విడుదల చేసిన గజిట్ వెంటనే నిలుపుదల చేయాలని, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, జన విజ్ఞాన వేదిక నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్యం శెట్టి డిమాండ్ చేశారు. డోన్ లో ఆదివారం యుటిఎఫ్ డోన్ మండల ప్రధానకార్యదర్శి గోపాల్ అధ్యక్షతన జరిగిన నిరసనలో యుటిఎఫ్ నాయకులు గజిట్ ప్రతులను దగ్ధం చేశారు.