పెండింగ్ లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ యుటిఎఫ్ డోన్ డివిజన్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం డోన్ పట్టణంలో నిర్వహించే నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు వెంకట సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం యుటిఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడారు.