గన్నవరం మండల పరిధి గ్రామాల్లో పేకాట, కోడి పందేలు జోరుగా సాగుతూ సంక్రాంతి పండుగను తలపిస్తున్నాయి. గ్రామాల్లో రాత్రి పగలు తేడా లేకుండా జూదం, కోడి పందేలు నిర్వహిస్తున్నారు. పేకాట శిబిరాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీసులకు ముడుపులు ముట్ట చెబుతున్నామని ఆటగాళ్ల వద్ద నుంచి కొంత వసూలు చేస్తున్నట్టు సమాచారం. పలు చోట్ల పేకాట ఆడిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నట్టు తెలుస్తుంది.