కేసీ కెనాల్ కు కొనసాగుతున్న నీటి విడుదల

61చూసినవారు
కోడుమూరు నియోజకవర్గంలోని సుంకేసుల రిజర్వాయర్ నుంచి కేసీ కెనాల్ కు నీటి విడుదల కొనసాగుతోందని శనివారం డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రస్తుతం కేసీ కెనాల్ కు రోజూ 256 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 1. 235 టీఎంసీ కాగా, ప్రస్తుతం సుంకేసుల రిజర్వాయర్ లో 0. 917 టీఎంసీ నిల్వ ఉందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్