సి. బెళగల్ మండలం ముడుమాల గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని గురువారం ఎస్సై తిమ్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 6వ తేదీన ముడుమాల, కొండాపురం గ్రామాల మధ్య దున్నపోతులు పొట్లాడుకుంటూ రవిని పొడవడంతో గాయాలయ్యాయి. అతడిని కర్నూలుకు ప్రభుత్వ ఆస్పతికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు తెలిపారు.