కోడుమూరు: బైక్ ను ఢీకొన్న ట్రాక్టర్.. ముగ్గురికి గాయాలు

76చూసినవారు
కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, ఇద్దరు కుమార్తెలకు గాయాలయ్యాయి. లింగందిన్నెకు చెందిన సుబహాన్ కర్నూలు నుంచి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి బైక్ పై స్వగ్రామానికి వెళ్తుండగా, ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుబహాన్ కాలుకు గాయాలయ్యాయి. ఇద్దరు బాలికలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.