ప్రతిఒక్కరూ వ్యక్తిగతంతోపాటు పరిసరాల శుభ్రత పాటించాలని రాష్ట్రీయ బాలస్వస్థ కార్యక్రమ జిల్లా కో-ఆర్డినేటర్ హేమలత సూచించారు. గురువారం కోడుమూరులోని కస్తూర్బా పాఠశాలను ఆమె తనిఖీ చేసి, మాట్లాడారు. విద్యార్థినులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీసి, రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు, నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని ఆమె సూచించారు. కల్లపరిలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ను తనిఖీ చేశారు.