నంద్యాల జిల్లా శ్రీశైలంలోని బాలుర వసతి గృహము (ఎస్ డబ్ల్యూ) ను జిల్లా ఎస్సీ సాధికారత అధికారిని చింతామణి బుధవారం సందర్శించి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోజు పిల్లలకు పెట్టే మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే మెనూలో అవక తవకలు జరగకుండా చూసుకోవాలని పిల్లలకు మంచి పౌష్టిక ఆహారం అందించాలని సూచించారు.