నేడు వయనాడ్కు ప్రియాంక, రాహుల్.. కాంగ్రెస్ భారీ బహిరంగ సభ

61చూసినవారు
నేడు వయనాడ్కు ప్రియాంక, రాహుల్.. కాంగ్రెస్ భారీ బహిరంగ సభ
కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో శనివారం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పర్యటించనున్నారు. వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంక భారీ మెజార్టీతో విజయం సాధించారు. గురువారం ఎంపీగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈ క్రమంలో ఎంపీ హోదాలో తొలిసారిగా వయనాడ్ లో పర్యటించబోతున్నారు. పర్యటనలో భాగంగా కోజికోడ్ జిల్లాలోని ముక్కమ్‌లో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్