కర్నూలు: ప్రజలకు నష్టం కలిగే పనులు చేయం: మంత్రి నిమ్మల

69చూసినవారు
తమది ప్రజా ప్రభుత్వం ప్రజలకు నష్టం చేకూర్చే పనులు ఏ ఒక్కటీ చేసేది లేదని, యురేనియం తవ్వకాలకు సంబంధించి ఆందోళన చెందకండని కర్నూలు జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భరోసానిచ్చారు. సోమవారం కర్నూలులో జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయం, ఉద్యానం, నీటి పారుదల, సాగునీరు, ఇసుక, వైద్యం, ఆరోగ్యం తదితర అంశాలపై మంత్రి అధికారులతో సమీక్షించారు.

సంబంధిత పోస్ట్