బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు నగర శివారులోని ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్, జిల్లా ఒలంపిక్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ పాల్గొన్నారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ సంఘ అధ్యక్షులు బొల్లావరం రామాంజనేయులు, ప్రిన్సిపాల్ జస్మిత్ కౌర్ పాల్గొన్నారు.