మంత్రాలయం పట్టణంలో ఆర్. కే. కంటి వైద్యులు డాక్టర్ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీమఠం వైద్యశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్రతీర్థులు అన్నారు. బుధవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందని డాక్టర్ హేమంత్ కుమార్ తెలిపారు. దాదాపు 175 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 50 మందిని ఆపరేషన్ల ఏర్పాట్ల చర్యలు తీసుకున్నామన్నారు.