ఆగి ఉన్న వాటర్ ట్యాంకరును ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మంత్రాలయం మండలం మాలపల్లి సమీపంలో ఆదివారం చోటు చేసుకున్నది. మాధవరం హెడ్ కానిస్టేబుల్ వీరేష్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రచ్చుమర్రికి చెందిన బోయ మజ్జిగ నాగేంద్ర (35) అనే వ్యక్తి మోటారు సైకిల్ పై భార్య పుట్టినిల్లయిన చింతకుంటకు వెళ్తుండగా మాలపల్లి సమీపంలో ఆగి ఉన్న ట్యాంకరను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.