మంత్రాలయంని శ్రీమఠంలో రాఘవేంద్రస్వామి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు ఆదివారం నవరత్నాల రథంపై ఊరేగారు. ధనుర్మాసంలో భాగంగా శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. సెలవు దినం కావడంతో తుంగభద్ర నది తీరాన అశేఖ భక్త జనవాహిని తరలిరావడంతో మంత్రాలయం భక్తులతో కిక్కిరిసింది. ప్రధాన రహదారులపై రోడ్లన్నీ వాహనాలు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.