నందికొట్కూరు మిడుతూరు రోడ్డు నందు గల గ్రంధాలయ స్థలము 45 సెంట్లులో నూతన భవనాన్ని నిర్మించి, పాఠకులకు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య కు సీపీఐ నాయకులు రఘురాం మూర్తి, శ్రీనివాసులు వినతిపత్రం అందజేశారు. సోమవారం నందికొట్కూరు పట్టణంలో స్థానిక మిడుతూరు రోడ్డు నందు గల పాడుబడ్డ గ్రంధాలయం ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకోనిర్వహించారు.