నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామానికి చెందిన బుట్ట నారాయణ కుమారుడు బుట్ట సుంకిరెడ్డి గురువారం గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలియగానే నంద్యాల పార్లమెంటు ఇన్ ఛార్జ్ మాండ్ర శివానంద రెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య శుక్రవారం నారాయణ స్వగృహానికి వెళ్లి సుంకి రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.