పాములపాడు మండలంలోని, ఎర్రగూడూరు గ్రామంలో పాములపాడు ఎస్సై కె. సురేష్ బాబు ఆధ్వర్యంలో నేరాల నియంత్రణకు ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఆత్మకూరు డిఎస్పి ఆర్. రామాంజి నాయక్ మాట్లాడుతూ చిన్న చిన్న విషయాలకు గొడవపడరాదని, భూతగాదాలు, అస్థిపంపకాలు, అక్రమసంబంధాలు గొడవలకు దారితీస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.