గోరుకల్లు రిజర్వాయర్ ద్వారా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలంలో 16 వార్డుల ప్రజలకు తాగునీటిని అందించాలి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి కోరారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే చరిత రెడ్డి మాట్లాడారు. కల్లూరు మండలంలో ప్రజలకు తాగునీటి సమస్య అధికంగా ఉందని, నిత్యం తాగునీటి సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని ఇరిగేషన్ శాఖ మంత్రికి తెలియజేశారు.