పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలం హుసేనాపురంలో ఆదివారం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో దుర్గామాత బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి హాజరై, అమ్మవారికి బోనాలు సమర్పించారు. దుర్గమ్మ అమ్మవారి బోనాల పండుగ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో పంటలు బాగా పండి, రైతులంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.