AP: రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే వైసీపీకి రాజీనామా చేస్తానన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే వైసీపీ పెద్దలకు చెప్పానని వివరించారు. అనివార్య పరిస్థితుల్లో జనసేన నుంచి వైసీపీలోకి వెళ్లానన్నారు. ఏ పార్టీలో చేరేది ఇప్పుడే వెల్లడించలేనని రాపాక స్పష్టం చేశారు.