ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలోని దేవస్థానం పరిపాలన భవనం వద్ద గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర పోరాటం చేసిన మహనీయులకు నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వాములైన మహనీయులందరిని దేశ ప్రజలందరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.